పిల్లల మిస్సింగ్ కేసుల పెరుగుదల ఆందోళనకరం: సుప్రీం కోర్టు

దేశంలో చిన్నారుల అదృశ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతోందని, ఇది తీవ్ర సమస్యగా మారిందని పేర్కొంది. దత్తత ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో, పిల్లలు లేనివారు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. దత్తత ప్రక్రియను క్రమబద్ధీకరించి, అక్రమ దత్తతను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తప్పిపోయిన పిల్లల కేసుల విచారణకు నోడల్ అధికారి నియామక ప్రక్రియను డిసెంబర్ 9 లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్