TG: మిస్ వరల్డ్ అందాల పోటీలకు వచ్చిన కంటెస్టెంట్‌ల కాళ్లను మహిళలు కడిగారంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మీరు ఎంతో మంది సినిమా యాక్టర్‌ల కోసం హైదరాబాద్‌ను ఏదోదో చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మీలాంటి వాళ్లు, మీ నాయకుల లాంటి వాళ్లు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్లు కడిగించుకున్న చరిత్ర, కాళ్లు మొక్కించుకున్న చరిత్ర మీదే అని మండిపడ్డారు.