విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో ఆపరేషనల్ ఖర్చులు భారీగా పెరగడంతో సంస్థలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ముఖ్యంగా ఏటీఎఫ్ (Aviation Turbine Fuel) ధరల పెరుగుదల వల్ల నిర్వహణ వ్యయం అధికమైందని వమానయాన సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వం తక్షణమే ఉపశమన చర్యలు తీసుకోకపోతే కార్యకలాపాలు కొనసాగించడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నాయి. ఖర్చులు తగ్గించేందుకు పన్నులలో రాయితీలు, ఇంధన ధరల నియంత్రణ వంటి చర్యలు అవసరమని కోరుతున్నాయి.