పెరిగిన సిగరేట్ ధరలు

టొబాకో కంపెనీ ITC పలు బ్రాండ్ల సిగరెట్ల ధరలను పెంచింది. 20 సిగరెట్లు ఉండే క్లాసిక్ కనెక్ట్ ప్యాక్ ధర రూ.390 నుంచి రూ.428కి, 10 సిగరెట్లు ఉండే గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ ప్యాక్ ధర రూ.79 నుంచి రూ.89కి పెరిగింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై GST 40%కు చేరడం, కొత్త ఎక్సైజ్ డ్యూటీ విధానంతో ఈ భారం పెరిగింది. స్మోకింగ్‌ చేయడం వల్ల రోగాలతో పాటు జేబులకు కూడా చిల్లు పడేలా చేసుకోవడం అవసరమా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕