పెరిగిన సీఎన్‌జీ ధరలు

వాహనదారులకు గ్యాస్‌ కంపెనీలు షాకిచ్చాయి. సీఎన్‌జీ రిటైల్‌ ధరలను సవరించాయి. ముంబై సహా పలు నగరాల్లో కిలోకు రూ.2 చొప్పున దీని ధరను పెంచాయి. ఢిల్లీని మాత్రం ఈ పెంపు నుంచి మినహాయించాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) సీఎన్‌జీ ధరను రూ.2 మేర పెంచింది. ముంబైలో సీఎన్‌జీ విక్రయించే మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (MGL) సైతం కిలోకు రూ.2 చొప్పున పెంచింది. దీంతో కిలో సీఎన్‌జీ ధర ముంబైలో రూ.77కు చేరింది.

సంబంధిత పోస్ట్