TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, హైదరాబాద్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వెదర్ నిపుణులు సూచిస్తున్నారు.