పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో రూ.10 నుండి రూ.17 వరకు ధర పెరిగింది. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.3,065గా ఉంది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీలు) రూ.994 వద్ద ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ఏపీలోని అమరావతిలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,001.50కు చేరింది. అలాగే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీలు) రూ.966.50గా ఉంది. నగరాలను బట్టి ధరల్లో మార్పులుంటాయి.

సంబంధిత పోస్ట్

✕
✕