TG: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వారంతం కావటంతో జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. దీంతో శ్రీ స్వామి వారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులు అధికంగా శ్రీ స్వామివారి సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొంటున్నారు.