పెరిగిన కోడిగుడ్ల ధరలు

తెలంగాణలో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో రూ.5-6 ఉన్న ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.7-8కి చేరింది. 30 గుడ్ల ట్రే ధర రూ.205కి చేరడంతో కొనుగోలుదారులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో విపరీతమైన ఎండల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గి, హీట్ స్ట్రోక్ తో కోళ్లు మృత్యువాత పడటమే దీనికి ప్రధాన కారణమని పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు తెలిపారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి.

సంబంధిత పోస్ట్