తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భానుడి భగభగలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్నూలులో నిన్న 38°C ఉష్ణోగ్రత నమోదైంది. అయితే అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అసాధారణంగా పొగమంచు కురుస్తుండటం వాతావరణంలోని మార్పులకు సంకేతం. తీవ్రమైన ఎండల వల్ల మామిడి పిందెలు రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.