మన దేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాతానికి గురవుతున్నారు. గత 20 ఏళ్లలో స్ట్రోక్ కేసులు రెట్టింపు అయ్యాయి. ప్రతి 20 సెకన్లకు ఒకరికి పక్షవాతం వస్తోంది. ప్రతి ఏటా సుమారు 18 లక్షల మంది ఈ సమస్యకు గురవుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అధిక రక్తపోటు, ఒత్తిడి, మధుమేహం, ధూమపానం వంటి కారణాలు దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.