తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దక్షిణ, తూర్పు తెలంగాణతో పాటు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ఇతర ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటూ, ఉదయం వేళల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.