BSNLకు పెరుగుతున్న సబ్‌స్క్రైబర్లు

ప్రైవేట్ రంగ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవలే ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగుతుండడమే అందుకు నిదర్శనం. గత 2 వారాల్లో బీఎస్ఎన్ఎల్‌‌కు 2.5 లక్షల మంది మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు ఎకనమిక్ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది.

సంబంధిత పోస్ట్