ధర్మశాలలో టీమిండియా, అఫ్గనిస్తాన్ మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. వర్షం పడేందుకు 60-70 శాతం అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్ ఉన్నారు.