IND vs NZ: న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా వికెట్లు పడుతున్నాయి. 10.2 ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (7) రింకు సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం 11.1 ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతికి రచిన్ రవీంద్ర (30) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోరు 137/4. క్రీజులో డారిల్ మిచెల్ (5) ఉన్నాడు.