జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. సికిందర్ రజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో రిచర్డ్ ఎంగరవకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 120 పరుగుల వద్ద ఈ వికెట్ పడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోరు 11 ఓవర్లకు 125/2గా ఉంది. క్రీజ్‌లో సూర్యతో పాటు అభిషేక్ శర్మ (50*) ఉన్నాడు.