చీరల షాపులో మహిళలపై అసభ్య ప్రవర్తన

TG: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఫ్రంటియర్ రాస్ చీరల షాపులో ఇద్దరు మహిళలపై సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్వామి అనే వ్యక్తి చీరను మహిళలపై డ్రేప్ చేసే సమయంలో వారిని అసభ్యకరంగా తాకినట్లు బాధితులు తెలిపారు. రెండు రోజుల్లో ఇద్దరు మహిళలు ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నారు. ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోపు సీసీ ఫుటేజ్‌ను సిబ్బంది డిలీట్ చేశారని మహిళలు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్