రేణు దేశాయ్ పై అసభ్య కామెంట్స్.. నిందితుడు అరెస్ట్

ప్రముఖ టాలీవుడ్ నటి రేణు దేశాయ్‌ను సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పదజాలంతో దూషించిన ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని గుంటూరుకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తి సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో రేణు దేశాయ్ వీడియోలకు అసభ్య కామెంట్స్ చేస్తున్నాడు. దీనిపై తాజాగా రేణు దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆరుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్