పోలీసులను ఆశ్రయించిన నటి ఈషా రెబ్బ

తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలుగు నటి ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్‌కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్ చేయడంతో, ఈషా అతడి ఐడీతో పాటు కామెంట్‌ను పోలీసులకు అందించిన ఫిర్యాదులో వివరించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కామెంట్స్ పెట్టినట్లు గుర్తించి విచారణ జరుపుతున్నారు. ఈషా రెబ్బ ఇటీవల 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్