ఇండిపెండెన్స్ డే స్పెషల్.. 85 వేల మొక్కలతో వందేమాతరం

AP: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు వినూత్నంగా ‘వందేమాతరం’ ఆకృతిని రూపొందించారు. 150 ఏళ్ల వందేమాతరం స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పల్లా వెంకన్న నర్సరీలో 85 వేల మొక్కలను ఉపయోగించి ఈ ప్రత్యేక ఆకృతిని తీర్చిదిద్దారు. నర్సరీ రైతు సత్తిబాబు నేతృత్వంలో యువ రైతులు వెంకటేశ్‌, వినయ్‌ సహా పలువురు దాదాపు వారం రోజుల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. మొక్కలతో రూపొందించిన ఈ భారీ ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్