ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ ‘ఏ’ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దోహాలో పాకిస్థాన్ ‘ఏ’తో జరిగిన మ్యాచ్లో 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 265 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ తిలక్ వర్మ (100) అద్భుత సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. అభిషేక్ శర్మ (70), షాహబాజ్ అహ్మద్ (56) రాణించినా ఫలితం లేకపోయింది. దీంతో పాక్ చేతిలో భారత్ ‘ఏ’కు నిరాశ తప్పలేదు.