ఇండియా-ఏతో మ్యాచ్.. శ్రీలంక-ఏ టార్గెట్ ఎంతంటే?

గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 189 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, లంక-ఏ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ (67) అర్ధసెంచరీ చేయగా, ఓపెనర్ ఆయుశ్ పాండే (38) పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్ 172 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇండియా-ఏ 311 పరుగులు సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక వర్షం అంతరాయం కలిగించే సమయానికి 6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్