ఢిల్లీలో గురువారం సాయంత్రం ఇండియా కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వర్చువల్ పద్ధతిలో నేతలతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా నవంబర్ 1న ఎస్ఐఆర్ (SIR), సీఈసీ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా చేపట్టనున్న భారీ బహిరంగ సభ నిర్వహణపై మరియు వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సభను ఎలా విజయవంతం చేయాలనే అంశంపై ఇండియా కూటమి నేతలు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.