పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిహార్‌లో ఓటర్ల సవరణ జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్ఐఆర్‌పై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం నోటీసును ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఇచ్చారు. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.