దేశంలో బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిషేధం విధించింది. లిథియం అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్ ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఈవీ బ్యాటరీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో, లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక ఖనిజాలను దేశంలోనే రీసైకిల్ చేయాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల లభ్యతను దేశీయంగానే పెంచడానికి ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.