బెల్జియం పర్యటనలో ఉన్న భారత ఎన్నికల సంఘం బృందం కూలూవెన్ యూనివర్సిటీతో ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపింది. బెల్జియం ఎన్నికల విధానం, భద్రతా చర్యలపై యూనివర్సిటీ ప్రతినిధులు వివరించగా, భారత బృందం దేశ ఎన్నికల వ్యవస్థ విశిష్టతను వివరించింది. ఎన్నికల అధికారుల సామర్థ్య వృద్ధిలో ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ సీఈఓ సి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. భారత్‌లో 99 కోట్ల ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టే చర్యలను కూడా వివరించారు.