భారత్ - చైనా మధ్య ఐదేళ్లుగా నిలిచిపోయిన విమాన సేవలు నేడు అక్టోబర్ 26 రాత్రి 10 గంటల నుంచి తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. కోల్‌కతా నుండి గ్వాంగ్‌జౌకు ఇండిగో విమానం మొదటి సర్వీసు బయల్దేరుతుంది. నవంబర్ 9న షాంఘై - ఢిల్లీ మధ్య చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్, నవంబర్ 10 నుండి ఢిల్లీ-గ్వాంగ్‌జౌ మధ్య ఇండిగో విమానాలు మొదలవుతాయి. ప్రస్తుతం వారానికి ఈ విమానాలు మూడు సార్లు నడుస్తాయి. ఇటీవల ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.