ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్‌పై 100 శాతం సుంకం విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె హెచ్చరించారు.