భారత్‌ల యువ జనాభా ఎక్కువే. తద్వారా భారత్ త్వరగా అభివృద్ధి చెందేందుకు వీలవుతుంది. 2025 నాటికి జనాభాలో భారత్, చైనాను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో జనాభా నియంత్రణ అమలు కచ్చితంగా లేకపోవడమే ఇందుకు కారణం. నిజానికి ప్రపంచంలో కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశపెట్టింది భారత్‌లోనే. ఇప్పటికైనా కుటుంబ నియంత్రణా చర్యలు కఠినంగా పాటించకపోతే ఇండియాలో తీవ్రమైన కరవు పరిస్థితులు రావచ్చనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.