ముడి చమురు కొనుగోళ్లపై భారత్‌కు పూర్తి స్వేచ్ఛ: రష్యా

భారత్ ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలనే పూర్తి స్వేచ్ఛ భారత్‌కు ఉందని రష్యా ప్రకటించింది. రష్యా అధ్యక్షభవనం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ మాట్లాడుతూ, భారత్‌కు ఎన్నో దేశాలు ముడి చమురును విక్రయిస్తున్నాయని, ఎవరి నుంచి ఏం కొనాలనే స్వేచ్ఛ భారత్‌కు ఎప్పుడూ ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి మోదీ సర్కార్ రష్యా నుంచి కొనుగోళ్లను ఆపేసిందన్న వార్తలపై ఆయన ఈ విధంగా స్పందించారు. మరోవైపు, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్