దేశ రాజధానిలో బుధవారం జరగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వర్చువల్ మీడియా సమావేశంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలను భారత్ సమర్థించదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ (FCC) ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంపై బంగ్లాదేశ్ తన ఆందోళనలను భారత్‌కు తెలిపింది.