భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. స్వల్ప వ్యవధిలోనే టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పయింది. ముందుగా కెప్టెన్ సూర్యకుమార్ ఔట్ కాగా, ఆ వెంటనే వచ్చిన తిలక్ వర్మ (0) డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ 34/4 స్కోరుతో కష్టాల్లో పడింది. క్రీజ్‌లో అక్షర్ పటేల్ (1)*, అభిషేక్ శర్మ (24)* ఉన్నారు.