భారత్ చాలా శక్తివంతమైన దేశం: అమెరికా రక్షణ మంత్రి

అంతర్జాతీయ భద్రతా సదస్సు ‘షాంగ్రి-లా డైలాగ్’ వేదికగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ భారత్‌ను ప్రశంసించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్ కీలకమైన, శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. భారత సాయుధ దళాల ఆధునీకరణ, పారిశ్రామిక, లాజిస్టిక్స్ సామర్థ్యాల విస్తరణను కొనియాడారు. రక్షణ రంగంలో భారత్‌తో కలిసి అధునాతన ఆయుధాల సహ-ఉత్పత్తికి అమెరికా కట్టుబడి ఉందని వెల్లడించారు. భారత్ ప్రాంతీయ భద్రతకు, వ్యూహాత్మక సమతుల్యతకు కీలకమని, ఇండో-పసిఫిక్‌లో ఉమ్మడి లక్ష్యాల సాధనకు తోడ్పడుతుందని హెగ్సెత్ అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్