సౌదీ అరేబియాను వెనక్కి నెట్టి భారతదేశం యూరప్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించింది. కెప్లర్ నివేదిక ప్రకారం.. భారతీయ రిఫైనరీల నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతిలో అనూహ్యంగా పెరుగుదల నమోదైంది. భారత్‌కు ప్రతిరోజూ 3.60లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన ముడి చమురును యూరప్‌కు ఎగుమతి చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎగుమతులు 20 లక్షల బ్యారెల్స్‌ను దాటుతుందని అంచనాలున్నాయి.