లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్, భారత్ ఐదో టెస్టు రెండోరోజు ఆట ముగిసింది. భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి 75/2 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ (51*) సాధించాడు. ఆకాశ్ దీప్ (4*) పరుగులతో క్రీజులో ఉన్నాడు.