టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆదిలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన యశస్వి జైస్వాల్ (2) మళ్లీ నిరాశపర్చాడు. అట్కిన్సన్ వేసిన నాలుగో ఓవరులో తొలి బంతికి LBWగా వెనుతిరిగాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఇంగ్లాండ్ రివ్యూ తీసుకుంది. థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.