రెండో T20.. భారత్ ఓటమి

భారత్‌తో జరుగుతున్న రెండో T20లో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. 155 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తిలక్ వర్మ (55) హాఫ్ సెంచరీతో రాణించినా.. సంజూశాంసన్, అభిషేక్ శర్మ డకౌట్ అయ్యారు. ఇషాన్ కిషన్ (12), శ్రేయస్ అయ్యర్ (10) నిరాశపర్చారు. అక్షర్ పటేల్ (14), శివమ్ దూబె (20), చివర్లో హర్షిత్ రాణా (21*) పరుగులతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లు జై మూండ్రా 3, హోలార్డ్ 3, హంఫ్రీస్, హ్యారీ టెక్టర్ తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్