భారత్ -పాకిస్తాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన అభిషేక్ శర్మ 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. హసన్ నవాజ్ వేసిన 15.5 ఓవర్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. చివరి వికెట్ పడటానికి సరిగ్గా ముందు బంతికి అభిషేక్ సిక్స్ కొట్టడం విశేషం.