ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ కష్టాల్లో పడింది. 23 ఓవర్లు ముగిసే సమయానికి టీమ్ ఇండియా 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. 22వ ఓవర్ చివరి బంతికి రింకు సింగ్ (6) హసన్ నవాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (23), సూర్యాంశ్ షెడ్జే (0) బ్యాటింగ్ చేస్తున్నారు.