IML T20 విజేతగా ఇండియా మాస్టర్స్

రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్‌ జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో వెస్టిండీస్‌పై ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ ఇచ్చిన 149 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంబటి రాయుడు (74) అర్ధశతకంతో చెలరేగాడు. సచిన్‌ (25), యువరాజ్‌ (13*) పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్