పెళ్లి వేడుకలో భారత్ - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లైవ్

TG: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లోని పెళ్లి వేడుకల్లో ఆసక్తికర ఘటన జరిగింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకలలో భాగంగా స్క్రీన్‌పై పెళ్లితో పాటు క్రికెట్ మ్యాచ్‌ను కూడా లైవ్ కవరేజ్ ప్లే చేశారు. వేడుకకు హాజరైన వారంతా పెళ్లితో పాటు మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు.

సంబంధిత పోస్ట్