భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ నేడు ఉదయం 07:30 గంటలకు ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్కు ఎంతో అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, మ్యాచ్ ఆరంభంలో పేస్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మైదానంలో గతంలో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ 259 పరుగులతో ఘన విజయం సాధించగా, భారత్ 172 పరుగులకే ఆలౌట్ అయ్యింది.