ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ ఏ విధంగానైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. కీవ్‌లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహాతో విస్తృత చర్చలు జరిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతోనూ భేటీ అయ్యారు. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల అంశాన్ని భారత్ లేవనెత్తిందని, భారత నావికులు కూడా ప్రాణాలు కోల్పోయారని జైశంకర్ తెలిపారు. ఈ దాడుల ప్రభావంతో ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.