వడోదరలోని కోటంబి స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే మహిళల జట్టుపై 121 పరుగుల తేడాతో భారత ఉమెన్స్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను భారత్ 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 329 పరుగుల లక్ష్యాన్ని చెందించడంలో జింబాబ్వే తడబడింది. 48.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయింది. ముపాచిక్వా 49, ముగేరి-తిరిపానో 46, బిజా 34 పరుగులు చేశారు. వైష్ణవి 4, దీప్తి శర్మ 3 కీలక వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించారు.