ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినా ఇంగ్లాండ్ రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా దెబ్బకు 166 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో అయిదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా సొంతం చేసుకుంది.