భారత్‌లో తొలి హైడ్రోజన్ ట్రైన్ ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ శుక్రవారం ఈ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. హరియాణాలో జింద్, సోనిపట్ మధ్య నడిచే ఈ ట్రైన్‌లో 10 ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలులో ఉండే ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్‌లో ఆక్సిజన్, హైడ్రోజన్ కలిసి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌తో రైలు నడుస్తుంది. ఈ రైలు కెపాసిటీ 2,600 మంది కాగా, వేగం 75-110 కేఎంపీహెచ్.