భారతదేశ విదేశీ కరెన్సీ నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. విదేశీ మారక ద్రవ్యం 8.053 బిలియన్ డాలర్లు పెరిగి, 709.413 బిలియన్ డాలర్లతో ఆల్‌టైమ్ హైని నమోదు చేసుకుంది. ఈ గణాంకాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తున్నాయి.