ఆసియా క్రీడల్లో భారత్ అదరగొట్టింది. అక్టోబర్ 2న ఒక్కరోజే 6 స్వర్ణ పతకాలు సాధించి పతకాల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్, పర్వీన్ హుడా, అంకుష్ పంగాల్ స్వర్ణాలు గెలవగా.. రెజ్లింగ్‌లో సుజీత్ కల్కల్ పసిడి దక్కించుకున్నాడు. మహిళల రికర్వ్ ఆర్చరీ (అంకిత, కీర్తి, కుంకుమ్) జట్టు తొలిసారి స్వర్ణం సాధించింది. మహిళల హాకీ జట్టు చైనాను ఓడించి 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచింది. దీంతో భారత్ ఖాతాలో 76 పతకాలు ఉండగా.. వీటిలో 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలు ఉన్నాయి.