పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోరులో భారత్ అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్‌పై 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ తొలి హాఫ్‌లో 0-1తో వెనుకబడిన భారత్, ద్వితీయార్థంలో పుంజుకుని పోరాడింది. సుహైల్ అహ్మద్ భట్, సందీప్ చేసిన కీలక గోల్స్ టీమ్ ఇండియాకు విజయాన్ని కట్టబెట్టాయి. రికార్డు స్థాయిలో పదోసారి ఈ ఛాంపియన్‌షిప్‌ను భారత్ కైవసం చేసుకోవడం విశేషం.

సంబంధిత పోస్ట్

✕
✕