భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే నేడు (మంగళవారం) హామిల్టన్‌లో జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే వర్షం ముప్పు పొంచి ఉండగా.. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ రాణించాలని జట్టు ఆశిస్తోంది. మరోవైపు గుర్నూర్ బ్రార్ సహా భారత పేసర్లు ఫామ్‌లో ఉన్నారు. గాయాలు, బ్యాటింగ్ వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న కివీస్ సిరీస్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. మ్యాచ్ ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.